సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ హంగామా

vijay deverakonda family star movie glimpse gets super response

హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది కొంతమంది క్రేజ్. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రం ఆ క్రేజ్ ఉంది. నిజానికి ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయినా కూడా విజయ్ కు మాత్రం క్రేజ్ వేరే ఉంటుంది. వరుసపెట్టి అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఖుషి సినిమా వచ్చాడు. ఆసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా ఉంది. గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్‌ దేవరకొండ, పరుశురాం కాంబినేషన్లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే రివీల్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకూ ఈసినిమా 15మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. దీంతో మరోసారి విజయ్ సోషల్ మీడియాలో తన సత్తా చూపించాడు. మరి గ్లింప్స్ కు ఈరేంజ్ లో వ్యూస్ అంటే గొప్ప విషయమే.

కాగా ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × four =