శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ సినిమా తరువాత శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా.. మహానటి సినిమా తరువాత సమంత-విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమపై మొదటి నుండి మంచి బజ్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. సెప్టెంబర్ 1వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నా రోజా నువ్వే పాట అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తరువాత రిలీజ్ అయిన ఆరాధ్య పాట కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈసినిమా నుండి టైటిల్ పాటను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే టైటిల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ఖుషి నువ్వు కనబడితే.. ఖుషి నువ్వు వినబడితే అంటూ వచ్చే ఈపాట ప్రోమో కూడా ఆకట్టుకుంటుంది. ఈపాటకు శివ నిర్వాణనే లిరిక్స్ అందించాడు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: