శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టగా.. పాటలు మాత్రం మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈసినిమా నుండి నా రోజా నువ్వే, ఆరాద్య పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈమేరకు తాజాగా ఈపాటకు సంబంధించిన అప్ డేట్ తో వచ్చేశారు. ఈ పాట రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. టైటిల్ సాంగ్ జులై 28వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
It is now time to fill this season with a lot of #Kushi and love ❤️
The most awaited #KushiTitleSong on July 28th 💥💥
In cinemas from SEP 1 ❤️🔥@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @saregamasouth pic.twitter.com/TwGGndxdEu
— Mythri Movie Makers (@MythriOfficial) July 24, 2023
ఇంకా ఈసినిమాలో జయరామ్, సచిన్ ఖడేఖర్, అలి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వై.రవిశంకర్, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: