మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం మరో కొత్త సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నటించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. నిజానికి ఈసినిమాను ఈనెల 18న విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కాకపోయేసరికి వాయిదా వేశారు. సెప్టెంబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం ఇప్పటికే మొదలుపెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి సిత్తరాల సిత్రావతి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. హీరోయిన్ అందాన్ని ప్రశంసిస్తూ వచ్చే ఈపాట మంచి మెలోడియస్ గా ఉండి ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈపాటను రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా ఆలపించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: