గం గం గణేశా- ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్

anand deverakonda first look out from Gam Gam Ganesha movie

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే తన అన్న మార్కుతో కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని మొదటినుండీ ఆ దిశగానే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మొదటిసినిమానే దొరిసాని అంటూ నటనకు స్కోప్ ఉన్న సినిమాను ఎంచుకొని మొదటిసినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడిస్ తో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతరువాత వచ్చిన హైవే, పుష్పకవిమానం నిరాశపరిచినా..రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తన నటనతో నటుడిగా ఈసినిమాతో మరో మెట్టుఎక్కాడు ఆనంద్ దేవరకొండ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. తాజాగా ఈసినిమాకు సంబంధించిన ఫుస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ హీరోయిన్ సమంత చేతుల మీదుగా ఈ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. రెండు చేతుల్లో గన్ లు పట్టుకొని ఉన్న ఆనంద్ దేవరకొండ లుక్ చూస్తుంటే ఈసినిమా కోసం తమ మేకోవర్ ను ఛేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక బ్యాగ్రౌండ్‌లోనూ గన్స్ పట్టుకున్న ఓ గ్యాంగ్, బాంబ్ బ్లాస్టింగ్ విజువల్స్‌తో కనిపిస్తున్నాయి. మరోవైపు రాజా వారి పల్లి అనే బోర్డు దానికింద రన్-ఫన్-గన్‌ అనే క్యాప్షన్ రాసి ఉంది. ఇక ఈసినిమా.. యాక్షన్ సినిమానా? కామెడీ సినిమానా? అనేది త్వరలో తెలుసుకుందాం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. హై లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. మరి చూడబోతే ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లా అనిపిస్తుంది. చూద్దాం దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =