టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అనే పేరు వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం సంయుక్త మీనన్ కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న డెవిల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. నవీన్ మేడార్ దర్శకత్వంలో 1940 బ్యాక్ డ్రాప్ తో స్పై థ్రిల్లర్ గా ఈసినిమాను రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు అధికారికంగా తెలియచేశారు మేకర్స్. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్డేడ్ ఇచ్చాడు మేకర్స్. ఈసినిమా నుండి సంయుక్త మీనన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా నేడు తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ట్రెడిషనల్ లుక్ లో ప్లెజెంట్ గా ఉన్న సంయుక్త లుక్ ఆకట్టుకుంటుంది. నైషధ అనే పాత్రలో సంయుక్త నటిస్తుంది.
👸Prepare to be spellbound by the alluring #DevilsAngel 😈😇, @iamsamyuktha_ !
Excited to introduce the talented and beautiful Samyuktha as Nyshadha.
Sending warm birthday wishes to the incredible! May your special day be filled with love, happiness, and countless blessings.… pic.twitter.com/MWPFZ4A8qA
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 11, 2023
కాగా దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: