అక్షయ్‌ కుమార్‌ బర్త్ డే.. వెల్‌కమ్‌ టు ది జంగిల్‌ అనౌన్స్‌మెంట్‌

Akshay Kumar Unveils Teaser of Welcome To The Jungle on His Birthday

బాలీవుడ్‌లో 2007లో వచ్చిన ‘వెల్‌కమ్‌’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. దర్శకుడు అనీజ్‌ బజ్మీ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అనంతరం ఆయన 2015లో దీనికి కొనసాగింపుగా ‘వెలకమ్‌ బ్యాక్‌’ సినిమాను రూపొందించాడు. అయితే అనీజ్‌ ఈసారి కథకు కామెడీతో పాటు కొంచెం మోతాదులో యాక్షన్‌ టచ్‌ అప్‌ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా వర్కవుట్ అయ్యి సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో బాలీవుడ్‌లో వెలకమ్‌ సిరీస్‌ మోస్ట్‌ ప్రాఫిటెబుల్‌ వెంచర్‌గా మారింది. అప్పటినుంచి మళ్లీ ఈ ప్రాంచైజీ నుంచి మరో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని హిందీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వేళ ఈ ప్రాంచైజీలో మూడో పార్ట్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈరోజు నటుడు అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టీమ్ ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో అక్షయ్‌ కుమార్‌, సంజయ్‌ దత్‌, సునీల్‌ శెట్టి, పరేష్ రావెల్, జానీ లీవర్, అర్షద్ వార్సీ, రాహుల్ దేవ్, రవీనా టాండన్‌, దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు నటీనటులు సందడి చేశారు.

ఈ మేరకు వీరందరూ ఒక స్పెషల్ వీడియోలో నటించారు. ఆర్మీ డ్రెస్సులు ధరించి, చేతిలో గన్స్ పట్టుకుని యాక్టర్లందరూ అడవిలో ఓ పాట పాడుతున్న వీడియో వీక్షకులకు గిలిగింతలు పెడుతోంది. అయితే ఈ మూవీకి మొదటి రెండు పార్టులకి దర్శకత్వం వహించిన అనీజ్‌ బజ్నీ కాకుండా బాఘీ సిరీస్‌, హీరోపంటి-2 వంటి సినిమాలు తెరకెక్కించిన అహ్మద్‌ ఖాన్‌ డైరెక్షన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 20వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + thirteen =