పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

peddhakapu1 movie trailer release date fixed

ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లతో అలరించాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే ధోరణి మారింది కాబట్టి శ్రీకాంత్ కూడా తన పంథాను మార్చి మాస్ పై పోకస్ పెట్టాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా పెదకాపు1. రెండు భాగాలుగా ఈసినిమా రాబోతుంది. అందులో మొదటి భాగం రాబోతుంది. ఇక ఊర్లలో ఉండే ఆదిపత్య పోరు నేపథ్యంలో ఈసినిమాా రాబోతున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. సెప్టెంబర్ 11వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.

కాగా ఈసినిమాలో విరాట్ కర్ణ హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు విరాట్ కర్ణ. ఇంకా ఈసినిమాలో రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈసినిమాకు.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =