మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Mark Antony Movie Completed All Censor Formalities

కోలీవుడ్ హీరో విశాల్‌కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’. విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో సినిమాకి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. దీని ప్రకారం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే మూవీ టోటల్ రన్‌టైమ్‌ 150 నిమిషాలు కలిగి ఉన్నట్లు సమాచారం. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ జానర్ లో తీసినట్లు అనిపిస్తోంది. ఇంకా విశాల్ డ్యూయెల్ రోల్స్ ప్లే చేసినట్లు అర్ధమవుతోంది. ఇక ఇంతకుముందు విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌, కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్‌ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

సైన్స్, ఫిక్షన్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవన్‌, టాలీవుడ్ కమెడియన్ సునీల్‌ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. అలాగే రీతూ, అభినయ, కింగ్స్లీ, యంజి మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సునీల్‌ ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయనటువంటి డిఫరెంట్‌ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15 తమిళం మరియు తెలుగు భాషలలో రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + thirteen =