ఫైనల్లీ షారుఖ్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎదురుచూసిన జవాన్ సినిమా అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో ముఖ్యంగా షారుఖ్ హీరో కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో మొదటి షో నుండీ మంచి టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ల లిస్ట్ లో చేరిపోయింది. అంతేకాదు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నాడు షారుఖ్. రెండురోజుల్లోనే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్తరికార్డులు క్రియేట్ చేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా హిట్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. జవాన్ బ్లాక్ బస్టర్ సినిమా.. కింగ్ తో కింగ్ సైజ్ ఎంటర్ టైన్ మెంట్ అందించాడు డైరెక్టర్ అట్లీ.. షారుక్ కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం.. ఆయన ఓరో, ఛార్మింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ అసాధ్యం.. తన సొంత రికార్డులను తానే బ్రేక్ చేసేలా ఉన్నాడు జవాన్ అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఆ ట్వీట్ కు షారుఖ్ స్పందిస్తూ స్వీట్ రిప్లై ఇచ్చాడు. మీకు సినిమా నచ్చినందుకు అందరూ ఎంతో థ్రిల్ అయ్యాను.. మీకు మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు. మీ నుండి ఇటువంటి మంచి మాటలు వినడం ఆనందంగా ఉంది. మీ అందరికోసం ఇకపై మరింతగా కష్టపడతాను, లవ్ యు మై ఫ్రెండ్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Thank u so much. Everyone is so thrilled you liked it. Big love to you and family. Very encouraging to hear your kind words. Will keep working harder now to entertain. Love you my friend. https://t.co/won5gxilR7
— Shah Rukh Khan (@iamsrk) September 8, 2023
కాగా ఈసినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపతి,దీపికా పదుకొనె కీలకపాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈసినిమాను..రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై గౌరీ ఖాన్ భారీ స్థాయిలో నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: