టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది ఈసినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దీనితో పాటు గోపీచంద్ మరో కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేయనున్నాడు. ఇక నేడు ఈసినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మైత్రీమూవీ మేకర్స్ నిర్మాత అయిన నవీన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా..లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. శ్రీను వైట్ల ఫస్ట్ షాట్ కు దర్శకత్వం వహించాడు. ఈనెలలోనే ఈసినిమా రెగ్యులర్ షూట్ ను మొదలుపెట్టనున్నారట.
Production No.1 of @ChitralayamStds – #Gopichand32, starring ‘Macho Star’ @YoursGopichand directed by @SreenuVaitla was launched Grandly in the presence of the bigwigs of the industry ✨💫
Clap by Legendary Director @Ragavendraraoba Garu, pic.twitter.com/AhKT5xjWX0
— Chitralayam Studios (@ChitralayamStds) September 9, 2023
కాగా శ్రీనువైట్ల ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన గోపీ మోహన్ ఈసినిమాకు స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా.. కేవీ గుహన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై వేణు దొనెపూడి ఈసినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో నటించే ఫీమేల్ లీడ్ ఇతర నటీనటుల గురించి త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: