
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 279


గుంటూరు కారం పై డీజే టిల్లు సూపర్ అప్ డేట్

నెక్ట్స్ లెవల్లో లియో ట్రైలర్

సంక్రాంతి బరిలో సైంధవ్- ఈసారి లెక్క మారుద్ది

ఈవారం ఏ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు?

లియో సెన్సార్ రిపోర్ట్

అఫీషియల్- రెండు పార్ట్ లుగా దేవర

తలైవర్ 170 షూటింగ్ ప్రారంభం

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ మాత్రం జోరుగా చేస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్స్ ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ అలానే పోసర్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది ట్రైలర్ కోసం. అయితే తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…

గుంటూరు కారం పై డీజే టిల్లు సూపర్ అప్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది.

హాయ్ నాన్న నుండి గాజు బొమ్మ సాంగ్ ప్రోమో రిలీజ్
దసరా తరువాత నాని హీరోగా రాబోతున్న ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్ హాయ్ నాన్న. టైటిల్ ను బట్టే ఈసినిమా ఎమోషనల్ రైడర్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. పాథర్ అండ్ డాటర్ బాండింగ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మరి ఎమోషనల్ కంటెంట్ అంటే నాని ఎలా చెలరేగిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.

మామ మశ్చీంద్ర మూవీ రివ్యూ-బంధాల విలువలు తెలియచేసే సినిమా
ఓవరాల్ గా చెప్పాలంటే మనిషి జీవితంలో డబ్బు అనేది ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది అనేది చూపించే ప్రయత్నం చేశారు. ఈరోజుల్లో బంధాలను పక్కనపెట్టి డబ్బుకు విలువ ఇస్తున్నారు ఎంతోమంది. ఈనేపథ్యంలో బంధాలు శాశ్వతం కానీ.. డబ్బు ఎప్పుడూ శాశ్వతం కాదని చక్కని మెసేజ్ ను ఇచ్చాడు హర్షవర్థన్.ఇక డిఫరెంట్ కథలను చూడాలనుకునే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. మిగిలిన వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు..

నెక్ట్స్ లెవల్లో లియో ట్రైలర్
దళపతి విజయ్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసేది లియో ట్రైలర్ గురించి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. మరోవైపు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. సెన్సార్ నుండి రిపోర్డ్ మాత్రం చాలా పాజిటివ్ గా వచ్చినట్టే తెలుస్తుంది. లియో విజయ్ కెరీర్ బెస్ట్ ఫిలిం అవుతుందని సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు సమాచారం.

అల్లు అర్జున్ అరుదైన ఘనత.. మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన ఘనతను అందుకోనున్నారు. త్వరలోనే ఆయన మైనపు విగ్రహం ప్రతిష్టాత్మక 'మేడమ్ టుస్సాడ్స్'లో కొలువుదీరనుంది. కాగా లండన్‌లోని 'మేడమ్ టుస్సాడ్స్' మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివిధ దేశాలకు చెందిన పలువురు ప్రముఖుల నమూనాలను వాక్స్ ఐడల్స్ రూపంలో ప్రతిష్టిస్తారు. ఈ విగ్రహాలు చూడటానికి అచ్చు ఆయా వ్యక్తులలాగే కనిపించడం వీటి ప్రత్యేకత. వీటిని సుశిక్షితులైన నిపుణులు అంత బాగా రూపొందిస్తారు. అయితే ప్రస్తుతం అనేక దేశాల్లో టుస్సాడ్స్ మ్యూజియాలను ఏర్పాటు చేశారు.

అర్జున్ దాస్ బర్త్ డే.. ఓజీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూనే.. మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు పలు అప్‌డేట్స్ వెల్లడిస్తూ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్నారు.

రైటర్ సత్యానంద్‌కు చిరంజీవి శుభాకాంక్షలు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్
టాలీవుడ్‌లోని సీనియర్ మోస్ట్ రైటర్లలో పి. సత్యానంద్ ఒకరు. తొలితరం దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడైన సత్యానంద్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'మాయదారి మల్లిగాడు’ చిత్రంతో రచయితగా కెరీర్ ప్రారంభించారు. ఇప్పటివరకూ ఆయన రచయితగా 400కు పైగా సినిమాలకు పని చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఒక అద్భుతమైన రికార్డుగా చెబుతుంటారు. కాగా సత్యానంద్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

సంక్రాంతి బరిలో సైంధవ్- ఈసారి లెక్క మారుద్ది
వచ్చేఏడాది సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. ఇప్పటినుండే డేట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగడానికే వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ సినిమాలతో పాటు హనుమాన్, అయలాన్, లాల్ సలామ్ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని రిజర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో వెంకీ సైంధవ్ కూడా చేరిపోయింది.

లియో నుంచి త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తోండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ అవగా.. ప్రస్తుతం డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.

ఈవారం ఏ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు?
శుక్రవారం వస్తుందంటే చాలు సినీ లవర్స్ కు పండగే. శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలకు పైనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉంటున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రూల్స్ రంజన్, మ్యాడ్, మామ మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, 800 ఇంకా చిన్నా సినిమాలు ఉన్నాయి.

ఓటీటీలోకి వచ్చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవడంతో పాటు నిర్మాతలకు లాభాలు…

యూఎస్‌లో ఆ రికార్డ్ సాధించిన సినిమాగా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. ఫన్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

లియో సెన్సార్ రిపోర్ట్
ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదంటే దళపతి విజయ్ నటించిన లియో ఇని చెప్పొచ్చు. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్ అందరూ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. అంచేకాదు ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి హైప్ నే క్రియేట్ చేసింది.

అఫీషియల్- రెండు పార్ట్ లుగా దేవర
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది ఒకసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. పుష్ప రెండు పార్ట్ లుగా వస్తుంది. సలార్ సినిమా కూడా ముందు ఒక సినిమానే అనుకున్నారు.. ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో స్టార్ హీరో సినిమా కూడా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ దేవర.

భగవంత్ కేసరి నుంచి ఉయ్యాలో ఉయ్యాలా లిరికల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భగవంత్ కేసరి’. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వరుస విజయాలతో జోరుమీదున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గారపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన హీరోయిన్ కాజల్ అగర్వాల్ తొలిసారిగా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. ప్రియాంక జవాల్కర్, అర్జున్ రామ్ పాల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా పండుగ…

చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామాయణం క్విజ్
ఆద్యాత్మికత, జ్ఞానం ఇంకా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేస్తూ మెరుగైన సమాజాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ అద్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి గారు. ఇక ఇప్పటివరకూ ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆన్ లైన్ రామయణం క్విజ్ కాంటెస్ట్. రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు. అలాంటి రామాయణం గురించి అన్ని వయసుల వారికి తెలియచేయాలన్న నేపథ్యంలోనే ఈ క్విజ్ ను నిర్వహిస్తున్నారు.

ముంబై పర్యటనలో రామ్ చరణ్.. ధోనితో ఫోటో, నెట్టింట వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ముంబైలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలుచోట్ల సందడి చేశారు. నగరంలోని ప్రముఖ సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఏటా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడన్న విషయం తెలిసిందే కదా. అయితే రామ్ చరణ్ అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక రాజకీయ నేత రాహుల్ నారాయణ్‌తో చరణ్ ఈ ఆలయానికి వెళ్లారు. రామ్ చరణ్ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించిన ఫొటోలను రాహుల్ నారాయణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ…

తలైవర్ 170 షూటింగ్ ప్రారంభం
సూపర్‌స్టార్ రజినీకాంత్ (తలైవర్) జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన చేసే తదుపరి సినిమాలపై అభిమానులతో సహా అంతటా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది సంక్రాంతికి ‘లాల్ సలాం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు రజినీకాంత్. దీనితోపాటు తాజాగా 'జై భీమ్' మూవీ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రం రజినీకాంత్‍కు 170వ చిత్రం కావడంతో ప్రస్తుతం 'తలైవర్ 170'గా పిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది.

అరుదైన రికార్డ్ సాధించిన బుట్టబొమ్మ సాంగ్.. థమన్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో దిగి సంచలన విజయం సాధించింది. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. పూజ హెగ్డే, టబు, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇక సినిమాతో పాటు ఈ చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా…