ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది ఒకసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. పుష్ప రెండు పార్ట్ లుగా వస్తుంది. సలార్ సినిమా కూడా ముందు ఒక సినిమానే అనుకున్నారు.. ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో స్టార్ హీరో సినిమా కూడా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ దేవర.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్లను ఇస్తూనే ఉన్నారు. రీసెంట్ గానే మరో అప్ డేట్ ను ఇచ్చారు. దేవర సినిమాలోని మిడ్ సీ నైట్ యాక్షన్ అండర్ వాటర్ సీక్వెన్స్ పూర్తి చేశాం అంటూ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తెలిపాడు. ఇప్పుడు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చారు మేకర్స్. ఇన్ని రోజులు ఈసినిమాను ఒక్క పార్ట్ గానే వస్తుంది అనుకున్నారు. కానీ ఈసినిమా రెండు పార్ట్ లుగా రానుందని మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు శివ కొరటాల వీడియో రిలీజ్ చేస్తూ తెలిపాడు. ఇక ఈ న్యూస్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారు.
#DEVARA will be coming to entertain you in 2 parts.
The first part is releasing on April 5, 2024. pic.twitter.com/x88jgGS9QI
— Devara (@DevaraMovie) October 4, 2023
కాగా కాగా కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండగా.. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























