అరుదైన రికార్డ్ సాధించిన బుట్టబొమ్మ సాంగ్.. థమన్ పోస్ట్ వైరల్

Buttabomma Becomes Most Viewed Songs on YouTube

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ బరిలో దిగి సంచలన విజయం సాధించింది. హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మించారు. పూజ హెగ్డే, టబు, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఇక సినిమాతో పాటు ఈ చిత్రంలోని పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అందులోనూ ముఖ్యంగా ఇక ‘బుట్టబొమ్మ’ పాట అయితే ప్రేక్షకులను విశేషంగా అలరించింది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ సాంగ్‌కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి బుట్టబొమ్మ పాటకు స్టెప్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలో యూట్యూబ్‌లో 850 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు వీడియో పాటగా నిలిచింది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ ఒక ట్వీట్ చేశారు. అందులో.. “ఇప్పుడు భారతదేశంలోని వివిధ భాషల్లో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు వీడియో పాటగా బుట్టబొమ్మ నిలిచింది! ధన్యవాదాలు” అని పేర్కొన్నారు. ఇక ఈ పాటను ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి రచించగా.. బాలీవుడ్ గాయకుడు అర్మాన్ మాలిక్ ఆలపించారు.

కాగా ‘అల వైకుంఠపురములో’ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. బుట్టబొమ్మ పాట ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మ్యూజిక్ అయితే.. అల్లు అర్జున్, పూజా హెగ్డే డ్యాన్స్ మరియు వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడం మరో కారణం. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న పుష్ప-2 చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గత నెలలో బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. వచ్చే యేడాది ఆగస్టు 15న ఈ సినిమా దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =