తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం ‘లియో’. త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటిస్తోండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో ‘లియో’ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ అవగా.. ప్రస్తుతం డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగా ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ క్రమంలో ఇంతకుముందే విడుదల చేసిన హీరో విజయ్, సంజయ్ దత్ లుక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది. ‘లియో’ సినిమాలోని హీరోయిన్ త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో ప్రమోషన్స్ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విడుదల చేసింది.
Unveiling the most-awaited look of @trishtrashers 💥#LeoTrailer is releasing today 💥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss @SunTV @SonyMusicSouth #Leo#LeoTrailerFromToday pic.twitter.com/oe15rahOw5
— Seven Screen Studio (@7screenstudio) October 5, 2023
ఇందులో త్రిష.. తన ముఖానికి దగ్గరగా రక్తం చిందిస్తున్న ఒక కత్తిని చూస్తూ భయంతో షాక్ అయినట్లు కనిపిస్తోంది. దీనిని చూస్తుంటే.. ఇదేదో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ నేపథ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈరోజు సాయంత్రం ‘లియో’ మూవీ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. దీంతో దళపతి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా అక్టోబర్ 19న దసరా పండుగ సందర్భంగా ‘లియో’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: