వచ్చేఏడాది సంక్రాంతికి పోటీ గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. ఇప్పటినుండే డేట్లను రిజర్వ్ చేసుకుంటున్నారు. పెద్ద సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో దిగడానికే వస్తున్నాయి. ప్రభాస్, మహేష్ సినిమాలతో పాటు హనుమాన్, అయలాన్, లాల్ సలామ్ లాంటి సినిమాలు కూడా సంక్రాంతిని రిజర్వ్ చేసుకున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో వెంకీ సైంధవ్ కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ముందు ఈసినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు రిలీజ్ డేట్ ను మార్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 13వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మరి అప్పటి వరకూ ఈ రిలీజ్ డేట్ నే ఉంచుతారో లేదో? చూడాలి..
ఈసారి సంక్రాంతి కి లెక్క మారుద్ది 😎#SAINDHAV Grand Release In Theatres Worldwide on 13th January 2024🔥#SaindhavOnJAN13th
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli… pic.twitter.com/Lj1NQcD5tE
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) October 5, 2023
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: