యూఎస్‌లో ఆ రికార్డ్ సాధించిన సినిమాగా.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

Miss Shetty Mr Polishetty Becomes 4th Highest Grossing Telugu Film of 2023 in USA

‘జాతిరత్నాలు’ ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించగా.. పి మహేష్ బాబు దర్శకత్వం వహించారు. సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబట్టింది. ఫన్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో సైతం కాసులు కురిపిస్తోంది ఈ సినిమా. ఇక ప్రధానంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ యూఎస్‌లో డాలర్ల వర్షం కురిపిస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.3 కోట్ల వరకూ షేర్ ను అందుకోగా.. యూఎస్‌లో 193K డాలర్లను రాబట్టుకొని అక్కడ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ మూవీ యూఎస్‌లో ($1.825M+) రూ.15,19,26,687 రాబట్టి.. టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీ గా నిలిచింది. తద్వారా ఈ సినిమా యూఎస్‌లో ఈ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన 4వ తెలుగు చిత్రంగా నిలిచింది.

కాగా ఈ సినిమాను హీరో నవీన్‌ పొలిశెట్టి యూఎస్‌లో కూడా గట్టిగానే ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రయత్నం ఇప్పుడు డాలర్ల రూపంలో ఫలితాన్నిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దీనికితోడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ తదితర ప్రముఖులు సినిమా అద్భుతంగా ఉందంటూ రివ్యూ ఇవ్వడం కూడా యూఎస్‌లో చిత్రం వసూళ్లపై ప్రభావం చూపిందని వారు అంటున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.