ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదంటే దళపతి విజయ్ నటించిన లియో ఇని చెప్పొచ్చు. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు సినీ లవర్స్ అందరూ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. అంచేకాదు ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ మంచి హైప్ నే క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం ముగించుకుంది. ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను అందించారు సెన్సార్ బృందం. అంతేకాదు సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమాపై ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. కొన్ని సన్నివేశాల్లో విజయ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఆయన కెరియర్ లోనే బెస్ట్ సినిమాలలోని లియో ఉంటుందని తెలియజేసినట్టు సమాచారం. మరి సెన్సార్ కూడా అయిపోయింది.. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది లియో ట్రైలర్ కోసం. నేడు రిలీజ్ కాబోతున్న ట్రైలర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
#LeoCensoredUA 🧊🔥#Thalapathy @actorvijay sir @Dir_Lokesh @trishtrashers @anirudhofficial @duttsanjay @akarjunofficial @7screenstudio @Jagadishbliss @SonyMusicSouth #Leo pic.twitter.com/Nv8MiUZlbQ
— Seven Screen Studio (@7screenstudio) October 4, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: