ఈవారం ఏ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు?

for which movie you are eagerly waiting on october 6th releases

శుక్రవారం వస్తుందంటే చాలు సినీ లవర్స్ కు పండగే. శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలకు పైనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉంటున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రూల్స్ రంజన్, మ్యాడ్, మామ మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, 800 ఇంకా చిన్నా సినిమాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రూల్స్ రంజన్
రత్నం కృష్ణం దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా రూల్స్ రంజన్. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాకు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా.. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి ఈసినిమాను నిర్మించారు.

మ్యాడ్
కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. రీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈసినిమాను సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సోదరి సూర్యదేవర హారిక ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మామ మశ్చీంద్ర
హర్షవర్థన్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా మామ మశ్చీంద్ర. ఈసినిమాలో దుర్గ అనే పాత్రలో, పరుశురామ్ ఇంకా డీజే అనే మూడు గెటప్స్ తో అలరించనున్నాడు. ఈసినిమాలో ఈషారెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు.

మంత్ ఆఫ్ మధు
శ్రీకాంత్ దర్శకత్వంలో నవీన్ చంద్ర హీరోగా వస్తున్న సినిమా మంత్ ఆఫ్ మధు. కలర్స్ స్వాతి ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. శ్రేయ నవేలి, హర్ష చెముడు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అచు రాజమణి సంగీతం అందిస్తున్న ఈసినిమాను యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.

800
శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ రియల్ స్టోరీ ఆధారంగా 800 ఈసినిమా వస్తుంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటిస్తుండగా.. ఈసినిమాను మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.

చిన్నా
ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వంలో సిద్దార్థ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చిన్నా. ఎమోషనల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈసినిమాను ఎటాకి సంస్థ నిర్మించింది. ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడులవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.