రైటర్ సత్యానంద్‌కు చిరంజీవి శుభాకాంక్షలు.. మెగాస్టార్ ట్వీట్ వైరల్

Megastar Chiranjeevi Tweets on Writer Satyanand as He Completes 50 years in TFI

టాలీవుడ్‌లోని సీనియర్ మోస్ట్ రైటర్లలో పి. సత్యానంద్ ఒకరు. తొలితరం దిగ్గజ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు మేనల్లుడైన సత్యానంద్ సూపర్‌ స్టార్‌ కృష్ణ నటించిన ‘మాయదారి మల్లిగాడు’ చిత్రంతో రచయితగా కెరీర్‌ ప్రారంభించారు. ఇప్పటివరకూ ఆయన రచయితగా 400కు పైగా సినిమాలకు పని చేశారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇది ఒక అద్భుతమైన రికార్డుగా చెబుతుంటారు. కాగా సత్యానంద్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణంలో సత్యానంద్ కీలక పాత్ర పోషించారు. చిరంజీవి హీరోగా నిలదొక్కుకోవడంలో సత్యానంద్ అందించిన అద్భుతమైన కథలు ఎంతగానో దోహదపడ్డాయి. దీంతో చిరంజీవి, సత్యానంద్ మధ్య ప్రత్యేక ఆత్మీయత ఉంది. ఇక సత్యానంద్ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మెగాస్టార్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి సత్యానంద్‌పై స్పెషల్ ట్వీట్ చేశారు. కాగా మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా సత్యానంద్‌ ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ సినీ కెరీర్‌లో మేటి తారలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నరసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలకు పనిచేశారు. అంతేకాకుండా ప్రజెంట్ జెనరేషన్ అగ్ర హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమాలకు కథలను అందించారు. ఈ క్రమంలో కొండవీటి సింహం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, అంజి, టక్కరి దొంగ వంటి పలు హిట్ సినిమాలకు కథని అందించారు.

అలాగే సత్యానంద్‌ ఒక సినిమాకు కూడా దర్శకత్వం వహించడం విశేషం. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి కథాంశం నేపథ్యంలో ‘ఝాన్సీ రాణి’ అనే సినిమాని తెరకెక్కించారు. సత్యానంద్ వీటితో పాటు మరెన్నో సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు కూడా అందించారు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’, విలక్షణ దర్శకుడు రవిబాబు రూపొందించిన ‘ఆవిరి’ సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే అందించారు. అప్పటి ప్రముఖ దర్శకులు వి.మధుసూధన రావు, కె రాఘవేంద్ర రావు నుంచి నేటి జెనరేషన్ డైరెక్టర్ కల్యాణ్‌కృష్ణ కురసాల వరకూ సత్యానంద్ కలిసి పని చేయడం గమనార్హం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =