టాలీవుడ్ స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంగళవారం ముంబైలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన పలుచోట్ల సందడి చేశారు. నగరంలోని ప్రముఖ సిద్ది వినాయకుడి ఆలయాన్ని సందర్శించారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న రామ్ చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రతి ఏటా చరణ్ అయ్యప్ప దీక్ష తీసుకుంటాడన్న విషయం తెలిసిందే కదా. అయితే రామ్ చరణ్ అయ్యప్ప దీక్షను సిద్ధి వినాయక ఆలయంలో పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. స్థానిక రాజకీయ నేత రాహుల్ నారాయణ్‌తో చరణ్ ఈ ఆలయానికి వెళ్లారు. రామ్ చరణ్ సిద్ది వినాయక ఆలయాన్ని సందర్శించిన ఫొటోలను రాహుల్ నారాయణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఈ క్రమంలో చరణ్‌ని చూసేందుకు అభిమానులు ఆలయం వద్దకు భారీగా చేరుకోవడంతో పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ముంబైలోని సిద్ది వినాయకుడి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఎంతోమంది సినీ, రాజకీయ, క్రీడల ప్రముఖులు ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం పరిపాటి. ఇక ముంబై పర్యటన సందర్భంగా రామ్ చరణ్ పలువురు ప్రముఖులను కూడా కలిశారు. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలుసుకున్నారు. ఆయనతో కలిసి ఫోటోలు దిగారు. అయితే వీరిద్దరూ ఒక యాడ్ షూట్ కోసం కలుసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ధోనీతో కలిసి దిగిన ఫొటోతో పాటు రామ్ చరణ్ ముంబై పర్యటనకు సంబంధించిన పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
PICTURE PERFECT ❤️🔥📸
Destructors in their respective fields💥#RamCharan #MSDhoni #GameChanger #TeluguFilmNagar pic.twitter.com/23QUWf8WnY— Telugu FilmNagar (@telugufilmnagar) October 4, 2023
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ ఇటీవలే తన ఇంట్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సతీమణి ఉపాసన కామినేని మరియు కుమార్తె క్లీన్‌కారా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి గణేషుడికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘వినయ విధేయ రామ’ తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా నటిస్తోన్న సినిమా ఇదే. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం కొందరు నటీనటులు అందుబాటులో లేనందున షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్‌కి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఇటీవలే రామ్ చరణ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయిన సంగతి తెలిసిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: