
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 256


తండ్రి కలను నిజం చేసిన చరణ్

కోట బొమ్మాళి మేకింగ్ వీడియో రిలీజ్

ఆదికేశవ ట్రైలర్ చూసి రియాక్ట్ అయిన రామ్ చరణ్

హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్

త్రిషకు మద్దతుగా చిరు కామెంట్స్

3D లో 38 భాషల్లో కంగువ రిలీజ్

బ్రీత్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని

సలార్ ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్స్ అప్ డేట్

నాగ చైతన్య 23 టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్
అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది.యువ సామ్రాట్ నాగ చైతన్య 23వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను కొద్దీ సేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు.రేపు నాగ చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఆసందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.ఇక ఈసినిమాకు తండేల్ అనే టైటిల్ ను ఖరారు చేయగా సముద్రం మధ్యలో బోటులో చైతన్య మాస్ లుక్ తో వున్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు.తండేల్ అంటే ఫిషింగ్ బోటు నడిపేవాడిని అర్ధం.గుజరాత్ తీర ప్రాంతంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈచిత్రం.

తండ్రి కలను నిజం చేసిన చరణ్
మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన సినిమాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సీతారామరాజుగా ఆర్ఆర్ఆర్ లో ఆయన చేసిన నటనకు గాను ప్రశంసల విమర్శలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేశాడు చరణ్. ఎన్నో ఏళ్ల చిరు కలను సైతం నిజం చేశాడు.

విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా.. రేపు కన్నప్ప నుంచి క్రేజీ అప్‌డేట్
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. స్టార్ ప్లస్‌లో ప్రసారమయ్యే ‘మహాభారత్’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మాలీవుడ్ నుంచి మోహన్‌లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్‌కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇంకా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సైతం మరో కీ రోల్‌ను పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్…

అజయ్ భూపతి డైరెక్షన్‌లో సినిమా, అది ఎలా ఉండాలంటే..? - విశ్వక్ సేన్
టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేయాలని ఉందని, త్వరలోనే అది కార్యరూపం దాల్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు యంగ్ హీరో విశ్వక్ సేన్. అజయ్ భూపతి తాజాగా దర్శకత్వం వహించిన సినిమా 'మంగళవారం'. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ ప్రధానపాత్రలో నటించగా.. అజ్మల్, నందితా శ్వేత, ప్రియదర్శి, అజయ్ ఘోష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. 'కాంతారా' ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. నవంబర్ 17న విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్ సేన్ స్పెషల్…

కోట బొమ్మాళి మేకింగ్ వీడియో రిలీజ్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వస్తున్నన సినిమా కోట బొమ్మాళి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈసినిమా నుండి రిలీజ్ అయిన లింగి లింగి లింగిడి అనే పాట అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు తాజాగా…

కొత్తదనంతో కూడిన మాస్ సినిమా ఆదికేశవ-వైష్ణవ్ తేజ్
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, యువ సంచలనం శ్రీలీల జంటగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదికేశవ'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ్ తేజ్ పలు విశేషాలను పంచుకున్నారు.

ఆదికేశవ ట్రైలర్ చూసి రియాక్ట్ అయిన రామ్ చరణ్
వైష్ణవ్ తేజ్,శ్రీ లీల జంటగా నటించిన చిత్రం ఆదికేశవ.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈసినిమాతో వైష్ణవ్ మాస్ ఇమేజ్ ట్రై చేస్తున్నాడు.ప్రమోషనల్ లో భాగంగా నిన్న ఈసినిమాను ట్రైలర్ ను విడుదలచేయగా పాజిటివ్ రెస్పాన్స్ తో యూ ట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ట్రైలర్ లో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.ఇక ఈ ట్రైలర్ గురించి స్పందించాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.ఆదికేశవ ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా వుంది వైష్ణవ్ తేజ్ తోపాటు టీం అందరికి ఆల్ ది బెస్ట్ టీం అంటూ ట్వీట్ చేశాడు.

బబుల్ గమ్- సెల్ఫ్ రెస్పెక్ట్ యాంథమ్ కోసం చిరు
దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో సుమ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై అప్పుడే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఎంట్రీతోనే రోషన్ హిట్ కొట్టే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

హనుమాన్ మూడోసాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్
అ!, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. సూపర్ హీరోస్ నేపథ్యంలో తేజ సజ్జా హీరోగా ఈసినిమా రాబోతుంది. ఈసినిమా వచ్చే ఏడాది పొంగల్ రేసులో దిగనుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను అలానే హనుమాన్ చాలీసా ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

మార్టిన్ లూథర్ కింగ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
సంపూర్ణేష్ బాబు హీరోగా పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో వచ్చిన సినిమా మార్టిన్ లూథర్ కింగ్. ఈసినిమా తమిళ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన మండేలా సినిమాను రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈసినిమా అక్టోబర్ 27వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

సైంధవ్ ఫస్ట్ సింగిల్ రాంగ్ యూసేజ్ సాంగ్ రిలీజ్
విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో చాలా కాలం తరువాత మళ్లీ వెంకీ మాస్ రోల్ తో రాబోతుండటంతో సినిమాపై మొదటినుండీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి ఇప్పటికే పలు అప్డేట్లను కూడా ఇచ్చారు.

హాయ్ నాన్న ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదలవుతుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ గా వుంది.నాని అయితే కొంచెం డిఫ్రెంట్ గా ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.ప్రస్తుతం తెలంగాణలో ఎలెక్షన్ మూమెంట్ కావడంతో ఓ రాజకీయ పార్టీ ఎలా అయితే ప్రజల్లోకి వెళ్తుందో అదే కాన్సెప్ట్ తో నాని ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.అందులో భాగంగా మొన్న నా పార్టీ హాయ్ నాన్న అంటూ మేనిఫెస్టో తో ఓ వీడియో చేయగా నిన్న ప్రెస్ మీట్ అంటూ మరో వీడియో చేశాడు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో హైలైట్ అయిన డైలాగులతో ఈవీడియో చేశాడు నాని.వీడియో మాత్రం హిలేరియస్ గా వుంది.

గుంటూరు కారం సెకండ్ సింగిల్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం.విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.డిసెంబర్ రెండో వారం కల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల విడుదలైన మొదటి సాంగ్ ధమ్ మసాలా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజైనా 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ రెండో సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రెండో పాట రిలీజ్ అప్డేట్ కూడా వచ్చేసింది.

త్రిషకు మద్దతుగా చిరు కామెంట్స్
అందాల నటి త్రిష పై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే కదా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమాలో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించాడు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ ఈసినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నేను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించా... అలానే లియో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని... కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధ పడ్డానని ఆయన అన్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు…

3D లో 38 భాషల్లో కంగువ రిలీజ్
ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.

బ్రీత్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. బ్రీత్ అనే టైటిల్ తో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది.

కెప్టెన్ మిల్లర్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
తమిళ టాలెంటెడ్ హీరో ధనుష్ మాత్రం డిఫరెంట్ కథలను, కొత్త ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అందుకే ధనుష్ సినిమాలంటే తమిళ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రీసెంట్ గానే సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్న ధనుష్ ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ధనుష్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ మూవీ ‘కెప్టెన్ మిల్లర్’. 1930-40ల నేపధ్యంలో ఈసినిమా రూపొందిస్తున్నారు.

హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని
ఈఏడాది సమ్మర్ లో దసరాతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాని చివర్లో హాయ్ నాన్నతో వస్తున్నాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రొమాంటిక్ & ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది. సాంగ్స్,ట్రైలర్ సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి.ప్రస్తుతం నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా వున్నాడు.అయితే ఈసినిమాను రెగ్యులర్ ప్రమోషన్స్ తో కాకుండా డిఫ్రెంట్ ఐడియాస్ తో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు.

సలార్ ఓవర్సీస్ డిస్ట్రీబ్యూటర్స్ అప్ డేట్
ప్రభాస్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

8రోజుల్లో టైగర్ 3 ఎంత రాబట్టిందో చెప్పేశారు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 కలెక్షన్ల వివరాలను అఫిషియల్ గా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ.ఈసినిమా ఎనిమిది రోజుల్లో దేశ వ్యాప్తంగా 280 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది ఇందులో నెట్ 230.75కోట్లు. అలాగే ఓవర్సీస్ లో 96కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఓవరాల్ గా 8రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 376కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.నిన్న ఈసినిమా దేశ వ్యాప్తంగా 10.25కోట్ల వసూళ్లను రాబట్టింది.