నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న డిసెంబర్ 7న విడుదలవుతుంది.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ కార్యక్రమాలతో ఫుల్ బిజీ గా వుంది.నాని అయితే కొంచెం డిఫ్రెంట్ గా ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.ప్రస్తుతం తెలంగాణలో ఎలెక్షన్ మూమెంట్ కావడంతో ఓ రాజకీయ పార్టీ ఎలా అయితే ప్రజల్లోకి వెళ్తుందో అదే కాన్సెప్ట్ తో నాని ఈసినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.అందులో భాగంగా మొన్న నా పార్టీ హాయ్ నాన్న అంటూ మేనిఫెస్టో తో ఓ వీడియో చేయగా నిన్న ప్రెస్ మీట్ అంటూ మరో వీడియో చేశాడు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ లో హైలైట్ అయిన డైలాగులతో ఈవీడియో చేశాడు నాని.వీడియో మాత్రం హిలేరియస్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేసి అంచనాలను పెంచాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు.తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు.ఈనెల 24న హాయ్ నాన్న ట్రైలర్ విడుదలకానుంది.శౌర్యువ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తుండగా వైరా ఎంటెర్టైనెంట్స్ నిర్మిస్తుంది.మరి ఈసినిమాతో నాని మరో బ్లాక్ బాస్టర్ ను ఖాతాలో వేసుకుంటాడో చూడాలి.
ఇక ఈసినిమా రిలీజ్ కాకముందే నాని తన తదుపరి చిత్రాన్ని లాంచ్ చేశాడు.ఈసినిమాను వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నాడు.యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రానున్న ఈసినిమాకు సరిపోదా శనివారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించనుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: