సూపర్ స్టార్ మహేష్ బాబు,స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం.విడుదలకు సమయం దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు.డిసెంబర్ రెండో వారం కల్లా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ఎలాగైనా సంక్రాంతి బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఇటీవల విడుదలైన మొదటి సాంగ్ ధమ్ మసాలా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజైనా 24గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టిన మొదటి తెలుగు సాంగ్ గా రికార్డు సృష్టించింది.ఈ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ రెండో సాంగ్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రెండో పాట రిలీజ్ అప్డేట్ కూడా వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వచ్చే వారంలో సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తామని నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ అన్నాడు.అంతేకాదు ఈ సాంగ్ తో కలిపి ఇంకో రెండో సాంగ్స్ ఉన్నాయని అవన్నీ కూడా వచ్చే ఏడాది మొత్తం పాడుకునేలా వుంటాయని అన్నాడు.ఈ రెండో సింగిల్ మెలోడీ గా రానుంది.యాక్షన్ &ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమా థియేటర్లలో కేవలం సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: