తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వస్తున్నన సినిమా కోట బొమ్మాళి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. ఇక ఈసినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ముఖ్యంగా ఈసినిమా నుండి రిలీజ్ అయిన లింగి లింగి లింగిడి అనే పాట అయితే ఓ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకొని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇప్పుడు తాజాగా ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. మేకింగ్ వీడియో కూడా ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు రాజ్ మరియు మిధున్ ముకుందన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: