ఎప్పుడు విభిన్నమైన సినిమాలు చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు తమిళ్ స్టార్ హీరో సూర్య. అందుకే ఆయనకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమాపై అంచనాలు ఓరేంజ్ లో ఉండగా దానికితోడు కంగువ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తూ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ఈమధ్యే ఈసినిమాలో ఆరు డిఫరెంట్ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని అవి ఆరు కూడా ఆరు విధాలుగా డిజైన్ చేశారని అంటున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ఈసినిమా 10 భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ ఇప్పుడు మరిన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమా నిర్మాత జ్ఞానవేల్ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని ఈసినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేశారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషల్లో.. 3డి, ఐమ్యాక్స్ ఫార్మాట్లలో ‘కంగువ’ విడుదల కానుందని తెలిపారు.
కాగా శివ దర్శకత్వంలో ఈసినిమాలో సూర్య పలు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: