హాయ్ నాన్నను డిఫ్రెంట్ గా ప్రమోట్ చేస్తున్న నాని 

Nani promotes to Hi Nana using various ideas.

ఈఏడాది సమ్మర్ లో దసరాతో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నాని చివర్లో హాయ్ నాన్నతో వస్తున్నాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.రొమాంటిక్ & ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది. సాంగ్స్,ట్రైలర్ సినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చాయి.ప్రస్తుతం నాని ఈసినిమాను తెగ ప్రమోట్ చేస్తూ బిజీగా వున్నాడు.అయితే ఈసినిమాను రెగ్యులర్ ప్రమోషన్స్ తో కాకుండా డిఫ్రెంట్ ఐడియాస్ తో ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్ ఫీవర్ స్టార్ కాగా నాని రాజకీయ నాయకుడిలా మారి మన పార్టీ హాయ్ నాన్న అంటూ మేనిఫెస్టో ప్రకటిస్తూ రెండు రోజుల క్రితం ఒక వీడియో చేశాడు.ఈ వీడియో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక నిన్న ముంబై వెళ్లి అక్కడ కూడా ప్రమోట్ చేశాడు.ప్రస్తుతం నాని తోపాటు మిగితా టీం ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు.

ఈసినిమా విజయంపై నాని సూపర్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్ గా నటించగా బేబీ ఖైరా ఖన్నా,నాని కూతురిగా నటించింది.ఖుషి ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.తెలుగుతోపాటు మిగితా భాషల్లో ఈసినిమా వచ్చే నెల 7న విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 11 =