విక్టరీ వెంకటేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో చాలా కాలం తరువాత మళ్లీ వెంకీ మాస్ రోల్ తో రాబోతుండటంతో సినిమాపై మొదటినుండీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. మరోవైపు ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టి ఇప్పటికే పలు అప్డేట్లను కూడా ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ రాంగ్ యూసేజ్ అనే పాటను నవంబర్ 21న రీలిజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు ఈ పాట రిలీజ్ కోసం రెండు వేదికలను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని CMR ఇంజనీరింగ్ కాలేజ్, వీఎన్ఆర్ వీజేఐటీ కాలేజీల్లో స్టూడెంట్స్ సమక్షంలో ఈపాటను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే తాజాగా ఈపాటను రిలీజ్ చేశారు మేకర్స్. మంచి బీట్ తో ఉన్న ఈపాట ఆకట్టకుంటుంది.
కాగా కాగా ఈసినిమాలో శ్రద్ద శ్రీనాథ్, ఆండ్రియా, నమాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ కూడా పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: