తండ్రి కలను నిజం చేసిన చరణ్

ram charan cutout at international film festival 2023

మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన సినిమాలతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. సీతారామరాజుగా ఆర్ఆర్ఆర్ లో ఆయన చేసిన నటనకు గాను ప్రశంసల విమర్శలు దక్కాయి. ఇక ఇప్పుడు మరో రికార్డును క్రియేట్ చేశాడు చరణ్. ఎన్నో ఏళ్ల చిరు కలను సైతం నిజం చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోవాలో ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్‌ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగనుంది. ఇక ఈ ఫెస్టివల్ లో మన తెలుగు సినిమాలు కూడా ప్రదర్శితమవ్వబోతున్నాయి. ఈనేపథ్యంలోనే అక్కడ ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ తో ఉన్న కటౌట్ ను పెట్టడం జరిగింది. దీంతో గంతలో చిరు మాట్లాడిన మాటలను పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు అభిమానులు.

2007లో తెలుగు సినిమా వజ్రోత్సవం వేడుకలో చిరంజీవి వేదిక మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్లిన తనకి ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి తెలుగు నటుల ఫోటోలు అక్కడ కనిపించలేదని, తెలుగు కళాకారులకు సరైన గౌరవం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు చరణ్ పోస్టర్ ను పెట్టడంతో తండ్రి మాటల్ని కొడుకు నిజం చేశాడు అంటూ అభిమానులు పోస్టులు వేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =