త్రిషకు మద్దతుగా చిరు కామెంట్స్

chiranjeevi reacts to actor mansoor comments on trisha

అందాల నటి త్రిష పై నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే కదా. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా లియో. ఈసినిమాలో మన్సూర్ అలీ ఖాన్ కూడా నటించాడు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మన్సూర్ అలీ ఖాన్ ఈసినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ.. నేను ఎన్నో సినిమాల్లో రేప్ సీన్స్ లో నటించా… అలానే లియో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో రేప్ సీన్ చేసే అవకాశం ఉంటుందేమోనని భావించానని… కానీ ఆ సినిమాలో అలాంటి సీన్ లేకపోవడంతో చాలా బాధ పడ్డానని ఆయన అన్నారు. ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కూడా స్పందించి త్రిషకు మద్దతిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ త్రిషకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. మన్సూర్ అలీఖాన్ చేసిన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని.. ఈ వ్యాఖ్యలు కేవలం సినీ ఆర్టిస్టులకే కాకుండా ఏ మహిళకైనా లేదా ఏ అమ్మాయికైనా అసహ్యంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండించాలని.. త్రిషతో పాటు ఇలాంటి వ్యాఖ్యలకు బాధితులుగా మారిన ప్రతి మహిళకు తాను అండగా నిలబడతానని తెలిపారు.

 

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 14 =