నాగ చైతన్య 23 టైటిల్,ఫస్ట్ లుక్ రివీల్ 

NC 23 title and first look out

అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది.యువ సామ్రాట్ నాగ చైతన్య 23వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను కొద్దీ సేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేశారు.రేపు నాగ చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు.ఆసందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు.ఇక ఈసినిమాకు తండేల్ అనే టైటిల్ ను ఖరారు చేయగా సముద్రం మధ్యలో బోటులో చైతన్య మాస్ లుక్ తో వున్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేశారు.తండేల్ అంటే ఫిషింగ్ బోటు నడిపేవాడిని అర్ధం.గుజరాత్ తీర ప్రాంతంలో వాస్తవిక సంఘటనల ఆధారంగా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కనుంది ఈచిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి డైరెక్ట్ చేయనుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించనుంది.రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు.100%లవ్,దడ తరువాత చైతు-దేవి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా.గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈసినిమాను నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

చైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది ఈసినిమా.ఇక ఈసినిమాప్రకటించిన దగ్గరినుండే మంచి హైప్ క్రియేట్ అయ్యింది.ఎలాగైనా ఈసినిమాతో కెరీర్ లో బిగెస్ట్  హిట్ కొట్టి ఫ్యాన్స్ ను ఖుషి చేయాలనీ నాగ చైతన్య పట్టుదలతో వున్నాడు.అందుకు తగ్గట్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =