ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. బ్రీత్ అనే టైటిల్ తో థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కూడా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమాా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 2వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
కాగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతాన్ని సమకూర్చారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: