
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 223


హనుమాన్ టీమ్‌ను అభినందించిన నాగచైతన్య

సలార్ పార్ట్ 2 లో అఖిల్ రోల్ పై క్లారిటీ

ప్రో కబడ్డీ లీగ్ లో ఈగల్

లైగర్ ఫ్లాప్ పై విజయ్ రియాక్షన్

హనుమాన్ కు డిమాండ్ మాములుగా లేదుగా

సరిపోదా శనివారం షూట్ లో జాయిన్ అయిన టాలెంటెడ్ హీరో

పెళ్లి రూమర్లపై రౌడీహీరో క్లారిటీ

వరుణ్ కోసం 126 అడుగుల భారీ కటౌట్

హనుమాన్ .. ఆల్ టైం రికార్డు
మీడియం బడ్జెట్ మూవీ గా వచ్చి హనుమాన్ బీభత్సం సృష్టిస్తుంది.స్టార్ హీరోల పేరిట వున్న రికార్డులను చెరిపేస్తూ హావ కొనసాగిస్తుంది.నిన్న 10వరోజు ఈసినిమా తిరుగులేని కలెక్షన్స్ ను రాబట్టుకొని పలు రికార్డులు సృష్టించింది.తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం 7.90కోట్ల షేర్ ను రాబట్టి నాన్ ఎస్ఎస్ఆర్ ఆల్ టైం రికార్డు క్రీయేట్ చేసింది.10వ రోజు ఇంతకుముందుఆర్ఆర్ఆర్ 16కోట్ల షేర్ ను అలాగే బాహుబలి 2.. 8కోట్ల షేర్ తో తొలి రెండు స్థానాల్లో వున్నాయి.తాజాగా హనుమాన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

మహేష్ బాబు తనయ సితార గొప్ప మనసు.. వారికోసం ‘గుంటూరు కారం’ స్పెషల్ షో
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే తన తండ్రితో కలిసి అనేక సేవాకార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న ఆమె మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది. తాజాగా సితార అనాథ పిల్లల కోసం మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ స్పెషల్ స్క్రీనింగ్‌ని ఏర్పాటు చేసింది. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏఎంబీ సినిమాస్ వేదికగా చీర్స్ ఫౌండేషన్ అనాథ పిల్లల కోసం గుంటూరు కారం ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు.

హనుమాన్ టీమ్‌ను అభినందించిన నాగచైతన్య
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించారు.

సప్త సాగరాలు దాటి సైడ్ బి ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చేసింది
గత ఏడాది రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానే ఆకట్టుకున్న సినిమా సప్త సాగరాలు దాటి పార్ట్ 1 అండ్ పార్ట్2. కన్నడలో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా రెండు పార్ట్ లుగా వచ్చిన ఈసినిమా మొదటిపార్ట్ ను ముందుగా రిలీజ్ చేయగా కన్నడలో సూపర్ హిట్ అయింది. సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కన్నడలో సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేయగా ఇక్కడా సూపర్ హిట్ అయింది. దాంతో పార్ట్ 2 ను కూడా రిలీజ్ చేశారు. పార్ట్ 2నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది.

సలార్ పార్ట్ 2 లో అఖిల్ రోల్ పై క్లారిటీ
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. అయితే ఇప్పుడు సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన కథే ఈసినిమా. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమా…

ప్రో కబడ్డీ లీగ్ లో ఈగల్
మాస్ మహారాజా రవితేజ నటించిన ఈగల్ ఈసంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సివుండగా పోటీ ఎందుకని వెనక్కి తగ్గింది.ఈసినిమా వచ్చే నెల 9న విడుదలవుతుంది.ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈరోజు ప్రో కబడ్డీ లీగ్ లో ఈగల్ టీం సందడి చేయనుంది.రాత్రి 7:00 గంటలకు లైవ్ లో జాయిన్ కానున్నారు.

ధనుష్ -శేఖర్ కమ్ముల సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
తమిళ హీరో ధనుష్ తన 51వ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో చేస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ అయ్యింది.పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతుంది.ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.రష్మిక మందన్న కథానాయకి గా నటిస్తుంది.ఇక ఇప్పుడు మరింత పవర్ ఆడ్ అయ్యింది.ఈసినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.దాంతో సినిమా క్రేజ్ మరింతగా పెరిగింది.

అయోధ్యకు పోచంపల్లి చేనేత వస్త్రాలు.. పూనం కౌర్ చేతులమీదుగా ప్రారంభం
విశ్వవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేళయింది. ఈ మేరకు సోమవారం (జనవరి 22, 2024) శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని గర్భగుడిలో శ్రీ బాల రాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ హనుమాన్ దేవస్థానం ఆలయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ట్రస్ట్రీ ఎస్ఎస్ జయరాజ్ వారి ఆధ్వర్యంలో బొమ్మెర్ల సతీష్ పద్మశాలి మరియు పద్మశాలి ఫౌండర్ గంజి కేదార్ సహకారంతో శ్రీ సీతారామ చంద్రుల వారికి పోచంపల్లి పట్టు వస్త్రాలు సమర్పించే పనికి శ్రీకారం చుట్టారు.

నా బయోగ్రఫి రాసే బాధ్యత మీకే అప్పగిస్తున్నా-చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానం గురించి సినీ పరిజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలుస్తుంది. ఎలాంటి సినిమా నేపథ్యంలేని కుటుంబం నుండి వచ్చి.. ఎంతో కష్టపడి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో ఏ పాత్ర వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళ్లాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎక్కుతూ మెగాస్టార్ అనే స్థాయికి ఎదిగారు. అప్పటి వరకూ చిరులాగ డ్యాన్స్ చేసేవాళ్లు లేకపోవడంతో ఆయన డ్యాన్స్ కు, స్టైల్ కు అప్పట్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉండేది. ఇప్పటికి కూడా అదే క్రేజ్ ఉందనుకోండి. ఇక ఇన్నేళ్ల తన సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో రికార్డులు పగలకొట్టారు, ఎన్నో అవార్డులు అందుకున్నారు.. ఎంతో పేరును సొంతం…

హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ.. కామెంట్రీతో సందడి చేసిన బాలకృష్ణ
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు క్రీడలలోనూ ఆసక్తి కనబరుస్తుంటారు. సాధారణంగా క్రికెట్ ప్రేమికుడైన ఆయన తన సినిమాల షూటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా విరామ సమయాల్లో యూనిట్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడుతుంటారు. అయితే బాలయ్య ఇతర క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రో కబడ్డీ పదో సీజన్‌కు నందమూరి బాలకృష్ణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్ మరియు బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న గేమ్ ఆన్ ట్రైలర్
డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా గేమ్ ఆన్. దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అనే కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుందని ఇప్పటికే తెలియచేసిన మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచారు.

లైగర్ ఫ్లాప్ పై విజయ్ రియాక్షన్
హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఇండస్ట్రీలో సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళుతుంటారు. సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ ను చేసుకుంటారు.. ఒక వేళ ఫ్లాప్ అయితే కాస్త బాధపడినా దాని నుండి బయటకు వచ్చి తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొండ సినిమా ఫెయిల్యూర్ పై ఆసక్తిక కామెంట్స్ చేస్తున్నాడు.

హనుమాన్ కు డిమాండ్ మాములుగా లేదుగా
హనుమాన్ రెండవ వారంలోకిఎంట్రీ ఇచ్చినా టికెట్ల కోసం డిమాండ్ ఇంకా తగ్గడం లేదు.హైదరాబాద్ లో నిన్నటి నుండి స్క్రీన్స్ కూడా పెంచారు అయితే ఎన్ని స్క్రీన్స్ ఆడ్ చేసిన టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయ్.ఈరోజు అయితే 95శాతం అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి.రేపు కూడా ఇదే ట్రెండ్ కొనసాగనుంది.ఈమధ్య కాలంలో ఇంత డిమాండ్ వున్న చిన్న సినిమా ఏది రాలేదని చెప్పొచ్చు.సంక్రాంతి కివచ్చి స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి హనుమాన్ విన్నర్ గా నిలిచింది.

దిల్ రాజు చేతిలో సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల రైట్స్
ఒకపక్క సినిమాలను నిర్మిస్తూనే మరోపక్క పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాయి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ లు. పెద్ద పెద్ద బ్యానర్ లు కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాయి. అందులో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఒకటి. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరోపక్క కొన్నిసినిమాల తెలుగు హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.

ఓటిటి లోకి సలార్.. రెస్పాన్స్ అదుర్స్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మొదటి భాగం సీజ్ ఫైర్ ఓటిటి లోకి వచ్చేసింది.నిన్న రాత్రి 12గంటలకు నెట్ ఫ్లిక్స్ ఈసినిమా తెలుగు తోపాటు తమిళ,మలయాళ,కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక ఈసినిమాకు థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఓటిటి లో అదే రెస్పాన్స్ వస్తుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు మిగితా వారు కూడా ఎలివేషన్ షాట్స్ ను స్క్రీన్ రికార్డింగ్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియా లో పెట్టేస్తున్నారు.ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్,డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ , రైటింగ్ రవి బస్రుర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలాగే యాక్షన్ సీక్వెన్క్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

సరిపోదా శనివారం షూట్ లో జాయిన్ అయిన టాలెంటెడ్ హీరో
న్యాచురల్ నాని మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు నాని. అందులో దసరా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించగా.. హాయ్ నాన్న డీసెంట్ హిట్ ను అందించింది. ఇక ఈ ఏడాది అప్పుడే పలు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్-ప్యాక్డ్ సినిమాగా ఈసినిమా రాబోతుంది. ఇప్పటికే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది.

తిరుగులేని నా సామిరంగ.. 6 డేస్ కలెక్షన్స్ ఎంతంటే?
కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'నా సామిరంగ'. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.

పెళ్లి రూమర్లపై రౌడీహీరో క్లారిటీ
హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. పబ్లిక్ ఫిగర్ లు కాబట్టి వారిపై ఫోకస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా అది సోషల్ మీడియాలో వైరలు అవుతుంటుంది. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇప్పుడు మరో హీరో తన పెళ్లి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

తగ్గని జోరు.. 150 కోట్ల క్లబ్ లో హనుమాన్
కథలో కంటెంట్ ఉంటే హీరో ఎవరు, బడ్జెట్ ఎంత అనే క్యాలిక్యూలేషన్స్ ఆడియన్స్ చూడరని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సినిమాలు నిరూపించాయి.. నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. మినిమం బడ్జెట్ తో ఈసినిమాను రూపొందించారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ లలో విజువల్స్ తో అటన్షన్ ను గ్రాబ్ చేశాడు. అలా మొదలైన హైప్ రిలీజ్ వరకూ కొనసాగుతూనే ఉంది. ఇక రిలీజ్ తరువాత సినిమా రిజల్ట్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. రిలీజ్ అయిన ప్రతి చోటా తన ప్రభంజనను చూపిస్తూనే ఉంది.

వరుణ్ కోసం 126 అడుగుల భారీ కటౌట్
సినిమా రిలీజ్ సమయాల్లో హీరోల భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం కామన్ థింగ్. ఇక ప్రతి విషయంలో పోటీ ఉన్నట్టే హీరోల కటౌట్ ల విషయాల్లో కూడా పోటీ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఇవి మరీ ఉంటాయి. ఇప్పుడు మరో భారీ కటౌట్ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ఆ కటౌట్ ఎవరిదో కాదు వరుణ్ తేజ్ ది. వరుణ్ తేజ్ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తిప్రతాప్ సింగ్ ఈసినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.