లైగర్ ఫ్లాప్ పై విజయ్ రియాక్షన్

vijay deverakonda reaction on liger movie flop

హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఇండస్ట్రీలో సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళుతుంటారు. సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ ను చేసుకుంటారు.. ఒక వేళ ఫ్లాప్ అయితే కాస్త బాధపడినా దాని నుండి బయటకు వచ్చి తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొండ సినిమా ఫెయిల్యూర్ పై ఆసక్తిక కామెంట్స్ చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న విజయ్‌ దేవరకొండను లైగర్ గురించి అడుగుతూ..ఈసినిమాలో ఏదైనా మార్చాలనుకుంటే ఏం మారుస్తారు అని అడుగగా.. ఈసినిమాలో నేను మార్చేది ఏంలేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ స్క్రిప్ట్ నాకు నచ్చే నేను ఒప్పుకున్నాను.. నేను ఎప్పటి నుండో వర్క్ చేయాలని వెయిట్ చేస్తున్న డైరెక్టర్ పూరీ గారు.. ఈనేపథ్యంలో ఈసినిమా కోసం నేను హండ్రెండ్ పర్సెంట్ ఇచ్చాను. నేను మార్చగలిగేది ఏమీ లేదు దాని గురించి కూడా నేను ఎప్పుడూ ఆలోచించలేదు.. ఈ సినిమా నా జీవితంలో ఒక భాగం.. సినిమాకోసం నేను కొన్ని రోజులు పనిచేశాను ఆ తరువాత మూవ్ ఆన్ అయిపోయాను అంతే. మన పని మనం చేసుకుంటూ వెళ్లాలి.. కొన్ని వర్కవుట్ అవుతాయి.. కొన్ని అవ్వవు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

కాగా విజయ్ దేరవకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − 1 =