హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. పబ్లిక్ ఫిగర్ లు కాబట్టి వారిపై ఫోకస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా అది సోషల్ మీడియాలో వైరలు అవుతుంటుంది. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇప్పుడు మరో హీరో తన పెళ్లి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత కొద్దిరోజులుగా విజయ్ దేవరకొండ పెళ్లిపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫిబ్రవరిలో పెళ్లి జరగబోతుందంటూ పలు కథనాలు వచ్చాయి. ఇక ఈ వార్తలపై తాజాగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. నేను ఫిబ్రవరిలో ఎలాంటి ఎంగేజ్ మెంట్, పెళ్లి లాంటివి చేసుకోవడం లేదు.. ఈ వార్తలను చూస్తుంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రెస్ వాళ్లు పెళ్లి చేయాలని అనుకుంటున్నట్టు ఉంది.. ప్రతి సంవత్సరం ఈ రూమర్ వింటూనే ఉన్నాను.. నేను ఎప్పుడు దొరికితే నాకు అప్పుడు పెళ్లి చేద్దామా అని చూస్తున్నారు అంటూ రూమర్లకు కౌంటర్ ఇచ్చాడు. మరి ఇప్పటికైనా ఈ వార్తలకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం..
కాగా విజయ్ దేరవకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇంకా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: