అయోధ్యకు పోచంపల్లి చేనేత వస్త్రాలు.. పూనం కౌర్ చేతులమీదుగా ప్రారంభం

Poonam Kaur Launches Maggam Works of Handloom Silk Clothes For Lord Shri Ram at Ayodhya

విశ్వవ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న నూతనంగా నిర్మించిన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి వేళయింది. ఈ మేరకు సోమవారం (జనవరి 22, 2024) శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలోని గర్భగుడిలో శ్రీ బాల రాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగునున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్ డివిజన్ హనుమాన్ దేవస్థానం ఆలయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ట్రస్ట్రీ ఎస్ఎస్ జయరాజ్ వారి ఆధ్వర్యంలో బొమ్మెర్ల సతీష్ పద్మశాలి మరియు పద్మశాలి ఫౌండర్ గంజి కేదార్ సహకారంతో శ్రీ సీతారామ చంద్రుల వారికి పోచంపల్లి పట్టు వస్త్రాలు సమర్పించే పనికి శ్రీకారం చుట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు ప్రముఖ సినీ తార పూనమ్ కౌర్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో దీనికి సంబంధించిన మగ్గంపనులను ప్రారంభించారు. కాగా వీటిని పద్మశాలి చేనేత కళాకారులు ఎంతో నియమిష్టలతో తయారుచేయనున్నారు. ఇక మగ్గం పనులు ప్రారంభం అయిన సందర్భంగా.. నటి పూనమ్ కౌర్ అక్కడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి కొబ్బరికాయలు కొట్టి చేనేత వస్త్ర కళాకారులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా పూనం కౌర్ మాట్లాడుతూ.. “అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మిస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేకంగా పోచంపల్లి నుంచి వచ్చిన చేనేత కళాకారులు శ్రీరామచంద్రుల వారికి చేనేత వస్త్రాలను తయారుచేయడానికి పూనుకోవడం అభినందనీయం. సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వారు ఎంతో నియమ నిష్టలతో భక్తిశ్రద్ధలతో ఈనెల 29వ తారీకు రాములవారికి ఇవ్వడం చాలా సంతోషదాయకం. ఎక్కడ ఆలయాలు ఉంటాయో అక్కడ పద్మశాలి చేనేత అన్నలు ఉంటారు. దేవుడి సేవలో తరించే వారందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలి. నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు” అని తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 17 =