సినిమా రిలీజ్ సమయాల్లో హీరోల భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం కామన్ థింగ్. ఇక ప్రతి విషయంలో పోటీ ఉన్నట్టే హీరోల కటౌట్ ల విషయాల్లో కూడా పోటీ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల విషయంలో ఇవి మరీ ఉంటాయి. ఇప్పుడు మరో భారీ కటౌట్ టాక్ ఆఫ్ ద టౌన్ గా నిలిచింది. ఆ కటౌట్ ఎవరిదో కాదు వరుణ్ తేజ్ ది. వరుణ్ తేజ్ నుండి త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. శక్తిప్రతాప్ సింగ్ ఈసినిమాకు దర్శకత్వంలో వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు. ఇక ఈనేపథ్యంలో ఫ్యాన్స్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. దీనిలో భాగంగానే తెలంగాణలోని సూర్యాపేటలో ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలోని లుక్ తో చేసిన 126 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ కటౌట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కాగా అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: