హైదరాబాద్‌లో ప్రో కబడ్డీ.. కామెంట్రీతో సందడి చేసిన బాలకృష్ణ

Nandamuri Balakrishna Commentary During Pro Kabaddi League in Hyderabad

టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు క్రీడలలోనూ ఆసక్తి కనబరుస్తుంటారు. సాధారణంగా క్రికెట్ ప్రేమికుడైన ఆయన తన సినిమాల షూటింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా విరామ సమయాల్లో యూనిట్ సభ్యులతో కలిసి క్రికెట్ ఆడుతుంటారు. అయితే బాలయ్య ఇతర క్రీడల పట్ల కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రో కబడ్డీ పదో సీజన్‌కు నందమూరి బాలకృష్ణ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా లీగ్‌లో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్ మరియు బెంగళూరు బుల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా ఈ మ్యాచ్‌కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్టేడియంలో సందడి చేశారు. ఇక బాలయ్య ఎంట్రీతో స్టేడియం మొత్తం మార్మోగిపోయింది. ఈ క్రమంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు పోడియంపై కబడ్డీ స్టయిల్‌లో తొడగొట్టి ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను ఉత్తేజపరిచారు. అనంతరం మ్యాచ్ జరుగుతున్న సమయంలో తనదైన శైలిలో కామెంట్రీ చెప్పిన ఆయన, ఈ సందర్భంగా తన చిన్ననాటి కబడ్డీ మెమోరీస్‌ను గుర్తు చేసుకున్నారు. తెలుగు టైటాన్స్ జట్టుకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇక సినిమాల విషయానికొస్తే.. బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో NBK109 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =