దిల్ రాజు చేతిలో సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల రైట్స్

dil raju grabs Saripodhaa Sanivaaram movie telugu states distribution rights

ఒకపక్క సినిమాలను నిర్మిస్తూనే మరోపక్క పలు సినిమాలను డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తున్నాయి ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ లు. పెద్ద పెద్ద బ్యానర్ లు కూడా ఇప్పుడు ఇదే ఫాలో అవుతున్నాయి. అందులో దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఒకటి. దిల్ రాజు ఇప్పటికే ఎన్నో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరోపక్క కొన్నిసినిమాల తెలుగు హక్కులను సొంతం చేసుకొని రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సినిమా హక్కులను సొంతం చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా సరిపోదా శనివారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్టు అధికారికంగా తెలియచేశారు.

కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై  నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 3 =