ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఈసినిమా ఫైనల్ గా డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. అయితే ఇప్పుడు సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో వచ్చిన కథే ఈసినిమా. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులు ఇన్నాళ్లూ సరైన సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించాయి. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. నేటి నుండే ఈసినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో ఈసినిమా అందుబాటులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సలార్ పార్ట్-2 శౌర్యాంగ పర్వం అనే టైటిల్ తో రాబోతుంది. ఇక ఈసినిమాలో అఖిల్ కూడా ఒక గెస్ట్ రోల్ లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. తాజాాగా ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత తన ఇన్ట్సా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను నిర్వహించారు. ఇక ఈ సెషన్ లో ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ గురించి.. సలార్ పార్ట్ 2 గురంచి ఎన్నోో ప్రశ్నలు వేశారు. వాటిలో కొన్ని ప్రశ్నలకు ఆమె డైరెక్ట్ గా సమాధానమిస్తే కొన్ని ప్రశ్నలకు మాత్రం చాలా చమత్కారంగా సమాధానాలు ఇచ్చారు. ఈనేపథ్యంలోనే ఈసినిమాలో అఖిల్ ఒక క్యామియోరోల్ లో నటిస్తున్నాడని రూమర్స్ వచ్చాయి నిజమేనా అని అడుగగా దానికి లిఖిత అది ఖచ్చితంగా రూమరే అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి దీంతో పార్ట్ 2లో అఖిల్ లేనట్టే అనే క్లారిటీ వచ్చేసింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: