కింగ్ నాగార్జున అక్కినేని ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో కనిపించారు. విలేజ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్స్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నాగార్జున పల్లెటూరి నేపథ్యంలో గతంలో ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇదే క్రమంలో మరోసారి తాజాగా ఆయన ‘నా సామిరంగ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే మలయాళంలో వచ్చిన ‘పురింజు మరియం జోస్’ అనే మూవీకి రీమేక్‌గా ఇది తెరకెక్కిడం విశేషం. అయితే ఈ ఏడాది పండుగ బరిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్’, ప్రశాంత్ వర్మ-తేజ సజ్జాల ‘హనుమాన్’ సినిమాలు ఉండటంతో ‘నా సామిరంగ’ ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందో అని తొలుత సందేహాలు వ్యక్తమయ్యాయి.
కానీ, ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ ‘నా సామిరంగ’ సినిమా సక్సెస్ అనిపించుకుంది. ఈ సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం.. అని సినిమా విడుదలకు ముందే ప్రకటించిన నాగార్జున.. చెప్పినట్లే ‘నా సామిరంగ’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ‘కిష్టయ్య’గా ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో నాగార్జున డైలాగ్స్, హీరోయిజం అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. దీంతో తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ.. విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ క్రమంలో బాక్సాఫీస్ వద్ద 6 రోజుల్లో మొత్తం 38.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 50 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: