కథలో కంటెంట్ ఉంటే హీరో ఎవరు, బడ్జెట్ ఎంత అనే క్యాలిక్యూలేషన్స్ ఆడియన్స్ చూడరని ఎన్నో సందర్భాల్లో ఎన్నో సినిమాలు నిరూపించాయి.. నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హనుమాన్ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. మినిమం బడ్జెట్ తో ఈసినిమాను రూపొందించారు మేకర్స్. అయితే సినిమా రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ లలో విజువల్స్ తో అటన్షన్ ను గ్రాబ్ చేశాడు. అలా మొదలైన హైప్ రిలీజ్ వరకూ కొనసాగుతూనే ఉంది. ఇక రిలీజ్ తరువాత సినిమా రిజల్ట్ ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. రిలీజ్ అయిన ప్రతి చోటా తన ప్రభంజనను చూపిస్తూనే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్స్ ప్రభంజనం కూడా ఇప్పట్లో తగ్గేలా లేదు. కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఈసినిమా రిలీజ్ అయి ఒక వారం అయిపోయింది. ఈ వారం రోజుల్లో హనుమాన్ మూవీ 150 కోట్లను సొంతం చేసుకుంది. మరి చిన్న సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే మాములు విషయం కాదు. ఇంకా వారం రోజుల్లో ఎలాంటి సినిమాలు లేవు. ఈ వారం రోజులు కూడా ఈసినిమా కలెక్షన్స్ కు కలిసొస్తుందని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: