డిఫరెంట్ కాన్సెప్ట్ లతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలాంటి డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా గేమ్ ఆన్. దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? అనే కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుందని ఇప్పటికే తెలియచేసిన మేకర్స్ సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 2వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ అయిత్ ఆకట్టుకుంటుంది. అసలు కథ ఏంటి అనేది సస్పెన్స్ లో ఉంచుతూ ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ ను బట్టి థ్రిల్లింగ్ అంశాలు సినిమాలో చాలానే ఉండేలా కనిపిస్తున్నాయి. విజువల్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.. సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో ఇంకా మధుబాల, ఆదిత్య మీనన్, వాసంతి, కిరిటీ, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈసినిమాను నిర్మిస్తున్నారు. అభిషేక్ ఏ.ఆర్ సంగీతం అందించగా.. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: