మల్లిక్ రామ్ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమా టిల్లు స్క్వేర్. డీజే టిల్లు సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్నసంగతి తెలిసిందే కదా. ఈసినిమా పలుమార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నా ఫైనల్ గా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టికెట్టే కొనకుండా అనే పాటను అలానే రాధిక అనే పాటను రిలీజ్ చేయగా అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి స్నీక్ పీక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రేపు అంటే ఫిబ్రవరి 7వ తేదీన ఈసినిమా స్నీక్ పీక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
It’s Time for the MADness to take over! 🕺
Fasten your seatbelts as a small sneak peek into our Tillanna’s big expedition is coming your way TOMORROW! 😎#TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @musicthaman @ram_miriyala @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84… pic.twitter.com/0DKzke6T4E
— Naga Vamsi (@vamsi84) February 6, 2024
కాగా ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ మిరియాల ,శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా..సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: