మాస్ మహారాజా రవితేజ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా కూడా రవితేజకు మాత్రం సాలిడ్ హిట్ అనేది రావడం లేదు. ధమాకా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ రాలేదు. ఇప్పుడు ఈగల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఈసినిమా ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది. ఈసినిమా స్పెషల్ ప్రీమియర్ షోను నిన్న రాత్రి వేశారు. ఈ షోకి రవితేజతో పాటు చిత్రయూనిట్ అందరూ పాల్గొన్నారు. ఇక సినిమా చూసిన అనంతరం రవితేజ చాలా హ్యాపీగా ఫీలైనట్టు మేకర్స్ తెలిపారు. ఈసినిమా చిత్ర నిర్మాణ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశారు. ఇక వీడియోలో రవితేజ ఫుల్ శాటిస్ ఫైడ్ అంటూ చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిత్రయూనిట్ కూడా ఫుల్ ఖుషిలో ఉన్నారు. మరి రవితేజ కాన్ఫిడెన్స్ ను ఈసినిమా నిలబెడుతుందా?లేదా?అన్నది చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
𝗜’𝗠 𝗦𝗨𝗣𝗘𝗥 𝗦𝗔𝗧𝗜𝗦𝗜𝗙𝗜𝗘𝗗 ❤️🔥❤️🔥❤️🔥
THE BLOCKBUSTER FIRST REVIEW of #EAGLE is out and it is from the Man himself 🔥
MASS MAHARAJA @Raviteja_offl expresses his SUPER CONFIDENCE after watching the special preview!
FEBRUARY 9th is going to be a blast for the audience in… pic.twitter.com/7DSau3cv1U
— People Media Factory (@peoplemediafcy) February 5, 2024
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్న ఈసినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాను దేవ్ జాన్డ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: