ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడి. ఈసినిమాను పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. దానికి తగ్గట్టుగానే ఈసినిమా డైరెక్టర్ అయిన నాగ్ అశ్విన్ ఎంతో రీసెర్చ్ చేశారు.. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకొని తీర్చిదిద్దుతున్నారు. దీనికి ఉదాహరణగా ఈసినిమా నుండి రిలీజ్ చేసిన వీడియోలను బట్టి చెప్పొచ్చు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారుచేయడం, ఫస్ట్ గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై అంచనాలు అసలే ఆకాశమంత ఉండటంతో ఏ అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ వెంటనే వైరల్ అయిపోతుంది. ఇప్పుడు ఈసినిమా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంతోష్ నారాయణన్ ఈసినిమా గురించి మాట్లాడుతూ.. కల్కి సినిమాలో ప్రభాస్ ఇంట్రడక్షన్ కోసం స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నా.. అది భారీగా ఇంకా మాస్ గా ఉండబోతుందని తెలిపారు.
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మే 9వ తేదీన ఈసినిమాను ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: