నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తండేల్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇక యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమా కోసం నాగచైతన్య తన మేకోవర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక ఈ సినిమా షూటింగ్ ను ఈమధ్యనే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా కీలక షెడ్యూల్ పూర్తయినట్టు తెలిపారు చిత్రయూనిట్. బ్యూటిఫుల్ విలేజ్ లో ఈసినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిందని.. మెయిన్ కాస్ట్ ఈ షూటింగ్ లో పాల్గొన్నారని.. వారితో కీలక సన్నివేశాలు చిత్రీకరించామని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Team #Thandel wraps up a schedule in the beautiful scenic village ❤️
The primary cast took part in this schedule where key scenes were shot in port & villages
Await for some beautiful updates coming your way soon 🌊#Dhullakotteyala 🔥
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 pic.twitter.com/lq4nakJW0r— Thandel (@ThandelTheMovie) February 5, 2024
కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈసినిమాను నిర్మిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: