రవితేజ అన్నతో కలసి అలాంటి సినిమా చేయాలని ఆశ – నవదీప్

Eagle Pre Release Event Navdeep Wants to Act with Ravi Teja in A Comedy Film

మాస్ మహారాజా రవితేజ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘ఈగల్’. మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. నవదీప్, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈగల్ టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపధ్యంలో ఈగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ ఫుల్ గా జరిగింది. ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడుతూ.. “పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అద్భుతమైన ప్రొడక్షన్ హౌస్. దాదాపు పాతిక సినిమాలు ప్రొడక్షన్‌లో వుండటం అంటే మామూలు విషయం కాదు. వారు సాధించిన విజయాలు అద్భుతం. హ్యాట్సాఫ్ టు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. ఇక మాస్ మహారాజా రవితేజ అన్నతో కలసి పని చేయడం గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఆయనతో ఓ కామెడీ సినిమా చేయాలని నాకొక ఆశ. టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. ఈగల్ తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది’’ అన్నారు

అలాగే మరో నటుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “రవితేజ గారిని నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చుట్టూ మంచి పాజిటివ్ వైబ్ వుంటుంది. ఎవరితోనైనా సరే హాయిగా కలిసిపోతూ అందరినీ హ్యాపీగా ఉంచే మనిషి ఆయన. ఇక నిర్మాతలు విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, కార్తిక్‌కి థ్యాంక్స్. అలాగే ఈగల్ టీం మెంబర్స్ అందరికి కూడా థాంక్స్. ఫిబ్రవరి 9న థియేటర్లలో ప్రేక్షకులకు అందరికీ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ అందుతుందనే నమ్మకం వుంది’’ అని అన్నారు. కాగా ఈగల్ చిత్రం ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్‌డ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =