టాలీవుడ్ కుర్రహీరో సుహాస్ మాత్రం సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ హిట్లు కొట్టుకుంటూ వెళుతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరనుండి హీరోగా మారి డిఫరెంట్ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు. కలర్ ఫొటో, రైటర్ పద్మ భూషణ్ సినిమాలతో డీసెంట్ హిట్లను అందుకున్న సుహాస్ తాజాగా అంజాబీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సుహాస్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. దీంతో ఈసినిమా కలెక్షన్స్ కూడా సాలిడ్ గా పెరుగుతున్నాయి. ఈసినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2.28 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే మూడు రోజుల్లో ఈసినిమా రెట్టింపు కలెక్షన్స్ ను రాబట్టుకున్నాయి. మూడు రోజుల్లో ఈసినిమా 8.6 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#AmbajipetaMarriageBand has a spectacular Sunday at the box office ❤️🔥
Incremental growth at the ticket windows with the total three days gross of 8.06 CRORES 💥💥
Book your tickets for the HARD HITTING BLOCKBUSTER now!
– https://t.co/Xpc4oD8yx8#BunnyVas @ActorSuhas… pic.twitter.com/CZFxSuOeib— GA2 Pictures (@GA2Official) February 5, 2024
కాగా ఈసినిమాలో శివాని నాగరం హీరోయిన్ గా నటించగా.. శరణ్య ప్రదీప్, నితిన్ ప్రసన్న, జగదీశ్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ, గాయత్రి భార్గవి, సురభి ప్రభావతి, కిట్టయ్య తదితరులు కీలకపాత్రల్లో నటించారు. గీతా ఆర్ట్స్2, ధీరణ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా.. సంగీతం శేఖర్ చంద్ర అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























