ఇప్పుడు మరో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆసినిమా మరేదో కాదు హనుమాన్ మూవీ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సూపర్ హీరోస్ నేపథ్యంలో హనుమాన్ వచ్చింది.సంక్రాంతికి ఈసినిమా బాక్సాఫీస్ బరిలో దిగింది. ఎన్నో పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా కానీ ఎంతో నమ్మకంతో రిలీజ్ అయింది. మేకర్స్ నమ్మకాన్ని నిజంచేస్తూ ఆడియన్స్ కూాడా ఈసినిమాకు బ్రహ్మరధం పట్టారు. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఫస్ట్ షో నుండో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా తెలుగు, హిందీతో పాటు ఓవర్సీస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా గురించి తేజ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. హనుమాన్ సినిమా షూటింగ్ దాదాపు రెండున్నర సంవత్సరాలు జరిగింది. ఆ టైమ్ లో నా దగ్గరకు ఎన్నో కొత్త సినిమాలు వచ్చాయి. ఒకటి కాదు రెండు రెండు కాదు 75 ప్రాజెక్ట్ లు రిజెక్ట్ చేశానని అందులో15 ప్రాజెక్ట్ లు చాలా మంచి కథలే అంటూ చెప్పాడు. ఇంకా సాధారణంగా ఒక సినిమా కోసం రెండు మూడు లుక్ టెస్ట్ లు చేస్తారు.. కానీ ఈసినిమా కోసం 25 లుక్ టెస్ట్ లు చేశానని తెలిపారు. అంతేకాదు ఈసినిమాలో ఎలాంటి డూప్ లేకుండానే అన్ని స్టంట్స్ నేనే చేశా.. ఈసినిమా వల్ల నేను స్కూబా డైవింగ్ కూడా నేర్చుకున్నా.. అండర్ వాటర్ సీక్వెన్స్ లు కూడా చేశా అంటూ చెప్పుకొచ్చాడు. బాక్సాఫీస్ నెంబర్స్ గురించి నేను ఎప్పుడూ ఆలోచించను.. సినిమా ఆడియన్స్ కు నచ్చిందా లేదా అనేదే చూస్తాను అంటూ తెలిపాడు.
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: